Homeసినిమా వార్తలునిఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

నిఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

- Advertisement -

గత కొన్ని రోజులుగా కార్తికేయ 2 మరియు హీరో నిఖిల్ సినిమాల పైనే చర్చ జరుగుతోంది. కార్తికేయ 2 చాలా కాలం క్రితమే విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల తరువాత తేదీలకు వాయిదా పడుతూ వచ్చింది. కార్తికేయ 2 సినిమా ప్రచారం చేస్తున్న సమయంలో, నిఖిల్ కార్తికేయ 2 సినిమాని థాంక్యూ కోసం వాయిదా వేయమన్నారు అనే దాని గురించి పలు మార్లు మాట్లాడారు, ఆ సమయంలో తన బాధను వ్యక్తం చేశారు.

ఆ ఇంటర్వ్యూ లోంచి రకరకాల బిట్లు మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రేక్షకులు నిత్యం అగ్ర నిర్మాత దిల్ రాజును లక్ష్యంగా చేసుకుని రకరకాల కామెంట్లు చేస్తూనే ఉన్నారు. దిల్ రాజు ఉద్దేశపూర్వకంగానే నిఖిల్ సినిమాలను టార్గెట్ చేస్తున్నారని పలు కథనాలు కూడా వచ్చాయి. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఆ నేపథ్యంలో అందరికీ అలానే అనిపించింది.

అయితే కార్తికేయ 2 సక్సెస్ మీట్ సందర్భంగా, ఈ పుకార్ల గురించి నిర్మాత దిల్ రాజు కాస్త ఘాటుగానే స్పందించారు. కేవలం తమ కథనాల పై క్లిక్‌ల కోసం మీడియా ఎప్పుడూ తనను ఏదో రకంగా టార్గెట్ చేస్తుందని ఆయన మండిపడ్డారు. తనకు, నిఖిల్‌కు మధ్య ఎలాంటి సమస్యలు లేవని, కార్తీకేయ 2 సినిమాని తాను ఏమీ టార్గెట్ చేయలేదని, దయచేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దని మీడియాను అభ్యర్థించారు.

READ  ఇస్మార్ట్ శంకర్ తో హరీష్ శంకర్

ఇది జరిగిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ప్రేక్షకులు మరోలా దిల్ రాజును మాటలు అంటున్నారు. కార్తీకేయ 2 సక్సెస్ మీట్ తరవాత కూడా దిల్ రాజు పై ట్రోలింగ్ ఆగలేదు. ఇక ఈ వివాదాలను ఏదో రకంగా ఆపేయాలని నిర్ణయించుకున్న దిల్ రాజు.. హీరో నిఖిల్ తో ఓ భారీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ఒక్కసారి తన పేరును మొత్తం వ్యవహారం నుంచి క్లియర్ చేయడానికి ఇలా చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది కానీ ఖచ్చితంగా సినిమా మెటీరియలైజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది.

కార్తికేయ 2 తర్వాత నిఖిల్ తన దృష్టిని తదుపరి చిత్రం అయిన 18 పేజీస్ వైపు పై ఫోకస్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. కార్తికేయ 2 నిఖిల్‌కు కెరీర్ లో పైకి ఎదగడానికి ఒక తొలి మెట్టుగా భావించిచవవచ్చు. తరువాత చేసే సినిమాలను సరైన విధంగా ప్లాన్ చేస్తే హీరోగా ఆయన నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం ఖాయం.

READ  లైగర్ సినిమా సెన్సార్ టాక్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories