Homeసినిమా వార్తలుDil Raju Leaked Vijay Deverakonda Movie Title విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ లీక్...

Dil Raju Leaked Vijay Deverakonda Movie Title విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు

- Advertisement -

తాజాగా యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కింగ్డమ్. ఈ మూవీపై అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న కింగ్డమ్ ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి అందరి నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

విజయ్ దేవరకొండ పవర్ఫుల్ లుక్ తో పాటు గ్రాండియర్ విజువల్స్, అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ లో అందరిని అలరించి సినిమాపై మరింతగా అంచనాలు పెంచాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇక దీని అనంతరం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తన్నారు విజయ్ దేవరకొండ. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఈ సినిమాకి రౌడీ జనార్ధన అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలిపారు దిల్ రాజు.

READ  Kayadu Lohar to Act with Vishwaksen విశ్వక్ సేన్ - అనుదీప్ మూవీలో హీరోయిన్ గా కయదు లోహర్ 

ఈ విషయాన్ని తాజాగా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీరిలీజ్ ప్రెస్ మీట్ సందర్భంగా దిల్ రాజు అనుకోకుండా లీక్ చేసారు. అయితే అనుకోకుండా మాటల సందర్భంలో ఆయన వెల్లడించిన ఈ టైటిల్ అందరిలో కూడా మంచి ఆసక్తి ఏర్పరిచింది.

ఈ మూవీ రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా ఇందులో విజయ్ దేవరకొండ పాత్ర అదిరిపోతుందని టాక్. ఆ విధంగా రెండు సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా కొనసాగుతున్నారు విజయ్ దేవరకొండ. ఇటీవల పరాజయాలతో కొనసాగుతున్న విజయ్ ఈ రెండు సినిమాలతో ఎంత మేర విజయాలని సొంతం చేసుకుంటారు చూడాలి మరి.

Follow on Google News Follow on Whatsapp

READ  Prabhas Fauji Release on that Time ప్రభాస్ ​'ఫౌజీ' రిలీజ్ అయ్యేది అప్పుడే ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories