Home సినిమా వార్తలు Dil Raju Hurts Anil Aavipudi అనిల్ రావిపూడిని హర్ట్ చేసిన దిల్ రాజు 

Dil Raju Hurts Anil Aavipudi అనిల్ రావిపూడిని హర్ట్ చేసిన దిల్ రాజు 

anil ravipudi dil raju

టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న వారిలో యువ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఒకరు. తొలిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ మూవీ ద్వారా మెగా ఫోన్ పట్టి ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ కొట్టి అందరినీ ఆకట్టుకున్నారు అనిల్ రావిపూడి. ఆ తరువాత నుండి కారెర్ పరంగా ఒక్కొక్కటిగా సక్సెస్ లు తన ఖాతాలో వేసుకుంటూ కొనసాగుతున్నారు అనిల్. 

ఇక ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా ఒక ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ తీస్తున్నారు. దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈమూవీపై వెంకీ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే, ఆయన తీస్తున్న ఈమూవీకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఆల్మోస్ట్ లాక్ అయింది అలానే మూవీని కూడా రానున్న సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేస్తూ షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నారు. 

అయితే మరోవైపు రామ్ చరణ్, శంకర్ ల కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్ ని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ ప్రకటించడంతో అనిల్, వెంకీ ల మూవీ ఇక సంక్రాంతికి రిలీజ్ లేనట్లే అని అంటున్నారు. ఈ విషయమై అనిల్ రావిపూడిని దిల్ రాజు హర్ట్ చేసారని తెలుస్తోంది. గతంలో అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు మూవీస్ రెండూ కూడా సంక్రాంతికి రిలీజ్ అయి పెద్ద విజయాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి పక్కాగా అనిల్ వెంకీ ల మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version