‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నిర్మాత దిల్ రాజు చాలా సంతోషంగా ఉన్నారు. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతకు భారీ లాభాలను, మంచి ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలతో అసోసియేట్ అయ్యే దిల్ రాజు బలగం సినిమాతో డిఫరెంట్ రూట్ లో వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుండి నిరంతర ప్రేమను పొందింది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ చిత్రం ఒక కుటుంబం యొక్క కథను చెబుతుంది మరియు ఆ కుటుంబం పెద్ద అనుకోని మరణం వల్ల తలెత్తే సామాజిక సమస్యల గురించి చర్చిస్తుంది.
అయితే ఈ సినిమా పాపులారిటీ తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు చేరింది. ఇటీవల ఓ గ్రామం మొత్తం బలగం చూస్తూ భావోద్వేగాలతో మునిగిపోయిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఈ కమ్యూనిటీ స్క్రీనింగ్ ఇప్పుడు దిల్ రాజు నుండి లీగల్ యాక్షన్ కు గురైంది.
ఈ విషయం పై నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప్రదర్శనలు సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను ప్రభావితం చేస్తాయని, అలాగే సినిమా అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఒప్పందం కూడా ఇబ్బందుల్లో పడుతుంది అని అన్నారు. పోలీసులు ఈ ప్రదర్శనదారుల పై చర్యలు తీసుకోవాలని, తన కంటెంట్ యొక్క అక్రమ పంపిణీని ఆపాలని, ఈ ఉచిత ప్రదర్శనలు నిర్వహించిన సంఘ విద్రోహ వర్గాల పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎస్పీకి రాసిన లేఖలో నిర్మాత దిల్ రాజు కోరారు.