Home సినిమా వార్తలు Dil Raju: భారీ బడ్జెట్ సినిమాలతో వరుసగా ఫెయిల్ అవుతున్న దిల్ రాజు

Dil Raju: భారీ బడ్జెట్ సినిమాలతో వరుసగా ఫెయిల్ అవుతున్న దిల్ రాజు

స్క్రిప్ట్ ఎంపికలో తన పరిపూర్ణతతో తనకంటూ ఓ సెపరేట్ బ్రాండ్, ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు. పక్కా ప్లానింగ్ తో తన సత్తాను నిరూపించుకుని, సహేతుకమైన బడ్జెట్ లో నాణ్యమైన సినిమాలను అందించడంలో ఆదర్శంగా నిలిచారు. కెరీర్ లో మీడియం బడ్జెట్ సినిమాలతో మంచి లాభాలు ఆర్జించడంలో దిట్టగా పేరు పొందారు.

బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను స్టార్ హీరోలతో కూడా దిల్ రాజు చాలా తక్కువ బడ్జెట్ తో మంచి క్వాలిటీ సినిమాలను నిర్మించారు. అయితే ఈ మధ్య కాలంలో దిల్ రాజు తన సినిమాల బడ్జెట్ పై పట్టు సాధించడంలో విఫలమవుతున్నారు. ఆయన కూడా అధిక బడ్జెట్ లు పెడుతున్నారు. ఫలితంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందించలేక పోతున్నారు.

ఆయన ఇటీవలే చేసిన పెద్ద సినిమాలైన మహర్షి, ఎఫ్ 3, వారిసు, తాజాగా శాకుంతలం వంటి సినిమాలను గమనిస్తే ఈ సినిమాల ఫైనల్ బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువే కావడంతో పాటు కంటెంట్ పరంగా కూడా అంత పటిష్టంగా లేవు. ముఖ్యంగా దిల్ రాజు తాజా చిత్రం శాకుంతలం పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.

ఇక దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ శంకర్ ల గేమ్ చెంజర్ సినిమా కూడా ఓవర్ బడ్జెట్ సమస్యతో సతమతమవుతోందని సమాచారం అందుతోంది. ఇప్పటికే అనుకున్న బడ్జెట్ ను క్రాస్ చేసిన ఈ సినిమా షూటింగ్ కు ఇంకా 60 రోజులకు పైగా సమయం ఉంది. మరి ఈ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version