Homeసినిమా వార్తలుDil Raju: దిల్ రాజు వ్యాఖ్యలు వారిసు తునివు టీమ్ మధ్య విభేదాలను సృష్టించాయా?

Dil Raju: దిల్ రాజు వ్యాఖ్యలు వారిసు తునివు టీమ్ మధ్య విభేదాలను సృష్టించాయా?

- Advertisement -

దిల్ రాజు మెల్లమెల్లగా వివాదాలకు చిరునామాగా మారుతున్నారు. సాధారణంగా పరిశ్రమలో స్టార్ హీరోలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటే ప్రెస్ మీట్ లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో ఇండస్ట్రీ సభ్యులు ఎప్పుడూ డిప్లమాటిక్ గానే సమాధానాలు ఇస్తారు. పరిశ్రమలో ఎవరినీ బాధపెట్టకుండా ఉండటానికి అందరూ ప్రయత్నిస్తారు.

నిజానికి నిర్మాత దిల్ రాజు కూడా ఇన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ ఏ హీరోనీ మరొక హీరోతో పోల్చలేదు. అలాగే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేదు. అయితే తమిళంలో విజయ్ నెంబర్ వన్ అని సూపర్ స్టార్ అని, తన ప్రత్యర్థి అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని దిల్ రాజు కామెంట్స్ చేశారు. దిల్ రాజు వ్యాఖ్యలు తునివు టీం మనోభావాలను దెబ్బతీసినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే వారిసు ఆడియో ఫంక్షన్ లో కూడా దిల్ రాజు విజయ్ నంబర్ వన్ అని మరోసారి చెప్పుకున్నారు. ఇప్పుడు రెండు చిత్రాలు తమ విడుదల తేదీ ఒకే రోజుగా నిర్ణయించడంతో బయ్యర్లకు భారంగా మారిన ఒకే రోజు విడుదల పై తమ క్లాష్ గూర్చి చర్చించుకోవడానికి రెండు పార్టీలు కూడా ఆసక్తి చూపడం లేదు.

READ  Varisu: వారిసు తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు మొత్తం దిల్ రాజుకు లాభాలే

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం తునివు విడుదల తేదీలో మార్పు ఉండవచ్చు అని అంటున్నారు. త్వరలోనే దీనికి సంభందించిన అధికారిక ప్రకటన రానుందట. ఒక వేళ అదే గనక జరిగితే, వారిసు బృందం దీని పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

కొద్ది రోజుల క్రితం దిల్ రాజు ఒక తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, కోలీవుడ్ లో అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని, తన చిత్రం వారిసుకు తమిళనాడులో తునివు కంటే ఎక్కువ స్క్రీన్లు కావాలని పేర్కొన్నారు.

అప్పటి నుండి దిల్ రాజు అజిత్ అభిమానుల నుండి ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారు మరియు ట్విట్టర్ లో కూడా ఆయన ట్రెండింగ్ లో ఉన్నారు.

ఈ వివాదంపై వ్యాఖ్యానించమని మీడియా అడిగినప్పుడు, దిల్ రాజు మాట్లాడుతూ, “నేను చెప్పిన దాని వెనుక పెద్ద కథ ఉంది, కేవలం 20 సెకన్ల క్లిప్ చూడడం ద్వారా నెటిజన్లు మరియు సినీ ప్రియులు ఇద్దరూ దీనిని పెద్ద సమస్యగా మార్చడం దురదృష్టకరం. ప్రతి ఒక్కరూ పూర్తి ఇంటర్వ్యూ చూసి నా ఉద్దేశ్యం మరియు ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను” అన్నారు.

READ  స్ట్రెయిట్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని సమర్ధించని అగ్ర నిర్మాతలు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories