రజినీకాంత్ హీరోగా నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, అమీర్ ఖాన్ ఇతర పాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ పై సుభాస్కరన్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక మరోవైపు ఈ మూవీ యొక్క యుఎస్ఏ ప్రీ బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి.
అయితే విషయం ఏమిటంటే, తాజాగా కూలీ మూవీకి అటు ఇండియా, ఇటు ఓవర్సీస్ లలో విభిన్నమైన సెన్సార్ రిపోర్ట్స్ లభించాయి. ఇక్కడ ఈ మూవీకి ఏ సెర్టిఫికెట్ లభించగా ఓవర్సీస్ లో యు / ఏ రేటింగ్ లభించింది. మూవీలో స్ట్రాంగ్ వయొలెన్స్ తో పాటు అక్కడక్కడ అడల్ట్ సీన్స్ ఉండడంతో ఇక్కడ ఏ రేటింగ్ లభించిందని, అయినప్పటికీ కూడా మూవీకి ఓవర్సీస్ లో యు / ఏ సెర్టిఫికెట్ సొంతం చేసుకుంది.
కాగా కూలీ మూవీని ఒకేవిధంగా అటు ఓవర్సీస్ ఇటు ఇండియాలో యు / ఏ సెన్సార్ లభించేలా ఎడిట్ చేయమని పలువురు ఫ్యాన్స్ కోరుతున్నప్పటికీ అది ప్రస్తుతం అది సాధ్యపడే అవకాశం లేదు. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన కూలీ మూవీ ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.