టాలీవుడ్ అందాల నటీమణుల్లో పూజా హెగ్డే కూడా ఒకరు. తొలిసారిగా టాలీవుడ్ కి నాగచైతన్య హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందిన ఒక లైలా కోసం మూవీ ద్వారా ఆమె పరిచయం అయ్యారు. అక్కడి నుండి వరుసగా పలు అవకాశాలు అందుకున్న పూజా హెగ్డే కు తెలుగులో అలవైకుంఠపురములో, మహర్షి, గద్దలకొండ గణేష్ వంటి సినిమాలు మంచి పేరుని తీసుకువచ్చాయి.
అయితే ఆ తరువాత తెలుగులో ఆమె చరణ్ సరసన ఆచార్యలో నటించారు, అయితే ఆ మూవీ ఫ్లాప్ అయింది. అనంతరం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్ మూవీ కూడా ఫ్లాప్ కావడం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక అటు తమిళ్ లో విజయ్ తో పూజా హెగ్డే నటించిన బీస్ట్ మూవీ కూడా సక్సెస్ కాలేదు.
ఇక తాజాగా సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీలో హీరోయిన్ గా చేస్తోన్న పూజా, మరోవైపు నేడు విజయ్ 69లో కూడా హీరోయిన్ గా ఎంపికయ్యారు. నిజానికి కెరీర్ పరంగా తమిళ్ లో పూజా హెగ్డేకు ఈ రెండు మూవీస్ ఎంతో కీలకం. మరి వీటితో మంచి సక్సెస్ కొట్టి కెరీర్ పరంగా పూజా హెగ్డే బ్రేక్ అందుకుంటారో లేదో చూడాలి.