ఇటీవల సంపత్ నంది తెరకెక్కించిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీ మంచి విజయం అందుకుంది. ఇక తాజాగా దానికి సీక్వెల్ అయిన ఓదెల 2 మూవీ మరింత గ్రాండ్ గా రూపొందుతోంది. ఈ మూవీ ని భారీ స్థాయిలో గ్రాండియర్ గా నిర్మించారు సంపత్ నంది.
మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంస్థలు నిర్మించిన ఈ మూవీని యువ దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తుండగా తమన్నా భాటియా ఇందులో నాగ సాధువుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఆ పాత్ర కోసం ఎంతో నిష్ఠగా వర్క్ చేసిన తమన్నా ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ లో ఆకట్టుకున్నారు.
ఒక ఊరికి పట్టిన చెడు పీడని వదిలించేందుకు రంగంలోకి దిగి దైవశక్తితో ఆ దుష్ట శక్తిని అంతమొందించే పాత్రలో తమన్నా అద్భుతంగా నటించారని అంటోంది టీమ్. ఇక టీజర్ లో గ్రాఫిక్స్, తమన్నా లుక్స్, హర్రర్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
మూవీ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని, తప్పకుండా ఓదెల 2 అందరి అంచనాలు మించేలా రేపు థియేటర్స్ లో ఆడియన్స్ ని మెప్పిస్తుందని నిర్మాత సంపత్ నంది అంటున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 17న విడుదల కానుంది.
దీని యొక్క ఓటీటీ రైట్స్ ని అమేజాన్ సంస్థ దాదాపు రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా రూ.6 కోట్లకు పైగా వచ్చింది. అలానే శాటిలైట్ డీల్ కూడా దాదాపుగా క్లోజ్ అయ్యింది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో పెట్టుబడిలో 80 శాతం తిరిగి రాబట్టినట్టు టాక్. మరి రిలీజ్ అనంతరం ఓదెల 2 ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.