మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
దిగ్గజ తెలుగు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ చివరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, వాస్తవానికి ఎన్నో ఏళ్ళ క్రితం శంకర్ తో మెగాస్టార్ చిరంజీవి ఒక మూవీ చేయాలనుకున్నారట,
అయితే అప్పట్లో కొన్ని కారణాల వలన వారిద్దరూ కాంబో సెట్ కాలేదు. మొత్తానికి ఇన్నేళ్ల అనంతరం ఆయనతో తన తనయుడు చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల చిరంజీవి ఆనందం వ్యక్తం చేసారు. ఇక ఈ కనుక మంచి సక్సెస్ సొంతం చేసుకుంటే శంకర్ తో మెగాస్టార్ సక్సెస్ కల నెరవేరినట్లే