ప్రస్తుతం హను రాఘవపూడితో ఫౌజీ అలానే మారుతితో ది రాజా సాబ్ సినిమాలు చేస్తున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఈ రెండు సినిమాల అనంతరం త్వరలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ప్రతిష్టాత్మక సినిమా స్పిరిట్ షూట్ లో ఆయన జాయిన్ అవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని విధాలుగా సంసిద్ధమవుతున్నారు ప్రభాస్.
ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా భద్రకాళి పిక్చర్, టి సిరీస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పిరిట్ మూవీని నిర్మించనున్నాయి. కాగా ఇందులో కీలకమైన పలు పాత్రల కోసం ఇటీవల క్యాస్టింగ్ కాల్ ని ఒక ప్రకటన ద్వారా స్పిరిట్ టీం సభ్యులు ప్రకటించారు.
పలు ఏజ్ గ్రూప్స్ వ్యక్తులు కావాలని ఆ ప్రకటనలో వారు తెల్పడం జరిగింది. అయితే తాను కూడా ఈ సినిమాలోని ఒక పాత్ర కోసం అప్లై చేసినట్టు నటుడు మంచు విష్ణు తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. మరోవైపు ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మరి స్పిరిట్ సినిమాలో తాను అప్లై చేసిన పాత్రకు విష్ణు ఎంతవరకు ఎంపిక అవుతారు అనే అంశం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
మరి పక్కాగా విష్ణు స్పిరిట్ మూవీలో ఉంటారా, ఒకవేళ ఉంటే ఏ పాత్ర ఆయనకు దక్కుతుంది అనే విషయాలన్నిటిపై కూడా క్లారిటీ రావాలంటే స్పిరిట్ టీం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సిందే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకి రానుంది.