Homeసినిమా వార్తలుకార్తీక్ సుబ్బరాజ్ రిస్కీ బెట్ ఫలిస్తుందా ?

కార్తీక్ సుబ్బరాజ్ రిస్కీ బెట్ ఫలిస్తుందా ?

- Advertisement -

కోలీవుడ్ యువ దర్శకుల్లో కార్తీక్ సుబ్బరాజ్ కు యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇటీవల ఆయన కథని అందించిన గేమ్ ఛేంజర్ పెద్ద డిజాస్టర్ అవడంతో పాటు స్వయంగా ఆయన తెరక్కించిన లేటెస్ట్ మూవీ రెట్రో కూడా అంచనాలు అందుకోలేకపోయింది. ఈ మూవీలో వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా నటించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు.

సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ ని అందుకుంది. చాలా మంది సాధారణ ఆడియన్స్ ఈ మూవీ చూసి పెదవి విరిచారు. ఏమాత్రం ఆకట్టుకోని విధంగా సాగె కథ, కథనాలు విసుగుతెప్పించాయని, కార్తీక్ మూవీ నుండి ఇది అసలు ఊహించలేదని మెజారిటీ ఆడియన్స్ అంటున్నారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ త్వరలో తాను ఒక ఇండిపెండెంట్ మోవుయిని తీయనున్నారని, అలానే దానిని ఫిలిం ఫెస్టివల్స్ కి పంపించిన అనంతరం ఏడాది తరువాత రిలీజ్ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం దాని యొక్క స్క్రిప్ట్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

READ  'స్పిరిట్' : ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ నటి ఫిక్స్ ?

అయితే ఈ రిస్కీ బెట్ లో కార్తీక్ ఎంతవరకు గెలుస్తారు అనేది ప్రస్తుతం కోలీవుడ్ ఆడియన్స్ లో చర్చగా మారింది. మొత్తంగా మరొక్కసారి ఈ మూవీతో కార్తీక్ తన అసలైన టాలెంట్ బయటకు తీయాలని పలువురు కోరుతున్నారు. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories