టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తుండగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన దేవర ఇప్పటికే యుఎస్ఏ సహా ఓవర్సీస్ లోని పలు ప్రాంతాల్లో ప్రీ సేల్స్ అదరగొడుతోంది. ప్రీమియర్స్ పరంగా ఈ మూవీ భారీ ఫిగర్ రాబట్టే అవకాశము ఉంది. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ దేవర తో మూడు ముఖ్యమైన మైల్ స్టోన్స్ ని ఆదుకోవాల్సి ఉంది.
ఏపీలోని గోదావరి జిల్లాలు, తెలంగాణ లోని నైజాం, ఓవర్సీస్ వంటి వాటిలో దేవర తో తన బాక్సాఫీస్ పొటెన్షియల్ ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అలానే ఇప్పటివరకు రూ. 100 కోట్ల షేర్ లని ఎన్టీఆర్ దీనితో అది రాబడతారా లేదా చూడాలి. ఆరేళ్ళ తరువాత సోలో హీరో మూవీ దేవరతో వస్తున్న ఎన్టీఆర్ తప్పకుండా అన్ని ఏరియాస్ లో భారీ రికార్డులు సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం దేవర ఏ స్థాయి సక్సెస్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.