Homeసినిమా వార్తలు'హరి హర వీర మల్లు' యుఎస్ఏ ప్రీమియర్స్ : అజ్ఞాతవాసి ని బీట్ చేస్తుందా ?

‘హరి హర వీర మల్లు’ యుఎస్ఏ ప్రీమియర్స్ : అజ్ఞాతవాసి ని బీట్ చేస్తుందా ?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ హిస్టారికల్ యాక్షన్ కమర్షియల్ సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచొ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ తో పర్వాలేదనిపించే రెస్పాన్స్ అందుకున్న హరిహర వీరమల్లు జూన్ 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యుఎస్ఏ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల  కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా యుఎస్ఏ ప్రీమియర్స్ పరంగా ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది.

ఆ మూవీ 1.5 మిలియన్స్ తో ఆ సినిమా ట్యూస్ డే ఆఫర్స్ తో నడిచింది. అయితే ఇప్పుడు హరిహర వీర మల్లు ప్రీమియర్స్ దాన్ని బీట్ చేస్తుందా అనేటువంటి ఆసక్తి అందరిలో ఉంది. తాజాగా ఓపెన్ చేసిన ఈ మూవీ ప్రీమియర్ బుకింగ్స్ మెల్లగా ఊపు అందుకుంటున్నాయి.

READ  'హరి హర వీరమల్లు' న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ 

మరి ఓవరాల్ గా హరిహర వీరమల్లు ప్రీమియర్స్ పరంగా అక్కడ ఎంత రాబడుతుందో అలానే రిలీజ్ అనంతరం ఏ స్థాయి కలెక్షన్ తో వరల్డ్ వైడ్ గా ఎంతమేర నెంబర్స్ పెడుతుందో అనేది తెలియాలంటే మరి కొన్నాళ్ల వరకు వెయిట్ చేయాలి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ కీలక పాత్రలు చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  'హరి హరి వీర మల్లు' : మాస్ సాంగ్ లోడింగ్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories