టాలీవుడ్ యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ పవర్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా అనిరుద్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుని బకాఫీస్ వద్ద కొనసాగుతోంది.
ఇక మరోవైపు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై దిల్ రాజు భారీగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
నిజానికి ప్రస్తుత పరిస్థితిని బాక్సాఫీస్ అంచనాలని బట్టి చూస్తే పలు ప్రాంతాల్లో దేవర ని గేమ్ ఛేంజర్ దాటేసి అవకాశం కనపడుతోంది. సంక్రాంతి కావడంతో నైజాంలో దేవర రాబట్టిన రూ. 50 కోట్ల షేర్ ని అలానే తమిళనాడు మరియు కేరళలో శంకర్ కు బాగా క్రేజ్ ఉండడంతో పాటు అటు కర్ణాటకలో కూడా గేమ్ ఛేంజర్ గట్టి ఆధిక్యతని చూపించే ఛాన్స్ ఉంది. ఇక హిందీ బెల్ట్ తో పాటు నార్త్ లో సైతం దేవర ఫుల్ రన్ నంబర్స్ ని ఈ మూవీ దాటేసే ఛాన్స్ గట్టిగా ఉంది.