టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మి గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్న ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో పాటు రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
ఆగష్టు 15న దీనిని గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. విషయం ఏమిటంటే, సరిగ్గా రిలీజ్ రోజు అనంతరం ఐదు రోజుల పాటు పండుగలు, వీకెండ్ అడ్వాంటేజ్ ఈ మూవీకి ఉంది. మరోవైపు అదే రోజున మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ తో పాటు తమిళ మూవీ తంగలాన్ కూడా రిలీజ్ కానున్నాయి.
ఇక గతంలో పూరి, రామ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ మంచి సక్సెస్ అందుకోవడంతో డబుల్ ఇస్మార్ట్ కూడా మరింత సక్సెస్ అవుతుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే మాత్రం ఆ ఐదురోజుల హాలిడేస్ ఈ మూవీకి పెద్ద అడ్వాంటేజ్ గా మారడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు. మరి డబుల్ ఇస్మార్ట్ ఆ అడ్వాంటేజ్ ని ఎంతవరకు వాడుకుంటుందో చూడాలి.