Homeసినిమా వార్తలు'దేవర - 2' ఆగిపోయిందా : అసలు క్లారిటీ ఇదే 

‘దేవర – 2’ ఆగిపోయిందా : అసలు క్లారిటీ ఇదే 

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన మూవీ దేవర. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి.

మంచి అంచనాలతో రిలీజ్ అయి హిట్ అందుకున్న ఈ మూవీ యొక్క సీక్వెల్ పై ఎప్పటి నుండో పలు వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీని రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయనున్నారు.

మరోవైపు సితార బ్యానర్ లో నెల్సన్ సినిమాతో పాటు హారికా హాసిని బ్యానర్ పై త్రివిక్రమ్ సినిమా కూడా ఆయన కెరీర్ లైనప్ లో ఉన్నాయి. దానితో దేవర 2 ఇక లేనట్లే అని వార్తలు వచ్చాయి.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం ఇప్పటికే ఆల్మోస్ట్ దేవర 2 యొక్క స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్న కొరటాల శివ, డ్రాగన్ మూవీ అనంతరం దీనిని పట్టాలెక్కించనున్నారని, దీని అనంతరం నెల్సన్, త్రివిక్రమ్ సినిమాలని ఎన్టీఆర్ చేయనున్నారని అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించి అప్ డేట్ కూడా రానుందట. ఇక దేవర ని మించేలా పార్ట్ 2 లో మరింతగా హైలైట్స్ ఉంటాయని టాక్.

Follow on Google News Follow on Whatsapp

READ  ఫ్యాన్ బాయ్ చేతుల్లో పవన్ స్టార్డం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories