Homeసినిమా వార్తలుBJP: నిఖిల్ ను కలవబోయి నితిన్ ను కలిశారా?

BJP: నిఖిల్ ను కలవబోయి నితిన్ ను కలిశారా?

- Advertisement -

టాలీవుడ్ నటులు నిఖిల్ మరియు నితిన్ మధ్య వారి ప్రమేయం లేకుండా జరిగిన ఒక హస్యాస్పద సంఘటన గురించి నిన్న సోషల్ మీడియాలో చిన్న స్థాయి సంచలనమే రేగింది. అయితే ఈ సంఘటన సినిమాలకు సంబంధించినది కాదు, బిజేపి పార్టీ వల్ల జరిగిన చిన్న పొరపాటుగా కనిపిస్తుంది. గత నెల ప్రారంభంలో బీజేపీ పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనలో నటుడు నితిన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకపోవడం వల్ల ఈ సమావేశం చాలామందిలో అనుమానాలను పెంచింది.

ఇప్పుడు తాజాగా వస్తున్న కొన్ని నివేదికల ఆధారంగా కొన్ని కొత్త విషయాలు పైకి రావడం ప్రారంభించాయి. ఇంతకీ విషయం ఏమిటంటే.. బిజెపి పార్టీ చీఫ్ కలవా కలవాలనుకున్నది హీరో నితిన్ ను కాదట. వారు అనుకున్నది నిఖిల్‌ను కలవాలని అని తెలుస్తోంది. కార్తికేయ 2 సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ యువ నటుడిని అభినందించాలని బిజెపి పార్టీ వారు భావించారట. కార్తికేయ 2 సినిమాలో హిందూ పురాణాల గూర్చి విస్తృతంగా చూపించారు. కాగా ఈ చిత్రం భారతదేశం అంతటా ప్రేక్షకుల చేత విశేష స్థాయిలో ప్రశంసించబడింది.

అయితే, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల ప్రకారం, నిఖిల్ మరియు నితిన్ పేర్ల మధ్య జరిగిన ఈ సిల్లీ మిస్టేక్ వల్ల JP నడ్డా నితిన్ ను కలవడానికి దారితీసింది అని అంటున్నారు. ఈ వార్త నిజమో కాదో తెలీదు కానీ ఈ పుకార్ల వల్ల మొత్తం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది మరియు నెటిజన్లు ఈ విషయం పై అలవాటు ప్రకారం మీమ్స్ మరియు ట్రోల్‌లను షేర్ చేసుకున్నారు.

READ  Box-Office: రెండవ రోజు కూడా బలంగా ఉన్న కార్తీకేయ-2 కలెక్షన్లు

ఇక కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఒకదాని తర్వాత ఒకటిగా రికార్డులను బద్దలు కొడుతూ పోతుంది. నిఖిల్ నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన కొన్ని రోజుల తర్వాత, ఇటీవలే మరో అరుదైన మైలురాయిని సాధించింది. కార్తికేయ 2 ఇప్పుడు US బాక్సాఫీస్ వద్ద $1.5 మిలియన్ల మార్కును దాటింది, నిఖిల్ ఈ అసాధ్యమైన పనిని చేసి ఆ ఘనత సాధించిన స్టార్ హీరోల పక్కన చేరారు.

Follow on Google News Follow on Whatsapp

READ  తెలుగు సినిమాకు ఊపిరి పోసిన బింబిసార - సీతారామం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories