తొలిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమా ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు అనిల్ రావిపూడి. ఆ మూవీతో పెద్ద విజయం అందుకున్న అనిల్ అక్కడి నుంచి వరుసగా పలు సినిమాలు చేస్తూ కొనసాగారు.
ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ భారీ విజయం అనిల్ కి దర్శకుడిగా మరింత విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చింది.
ఇక కెరీర్ పరంగా ఏ ఒక్క అపజయం లేని దర్శకుడిగా దిగ్విజయంగా కొనసాగుతున్న అనిల్ రావిపూడి రానున్న 2026 సంక్రాంతి కానుక మెగాస్టార్ చిరంజీవితో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు రానున్నారు.
అనంతరం 2027 సంక్రాంతికి ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ గా మళ్లీ సంక్రాంతి వస్తున్నాం అనే మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు రానున్నారు.
మొత్తంగా ఈ సంక్రాంతికి ఒక హిట్టు కొట్టిన అనిల్ త్వరలో రానున్న రెండు సంక్రాంతిలకు కూడా విజయం అందుకుని హ్యాట్రిక్ నమోదు చేస్తారో లేదో చూడాలి. కాగా చిరంజీవి, అనిల్ మూవీ సమ్మర్ లో పట్టాలెక్కనుంది. భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించనున్న ఈమూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించనున్నారు.