Homeసినిమా వార్తలు'గుడ్ బ్యాడ్ అగ్లీ' : అజిత్ కి హిట్ దక్కేనా ?

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ : అజిత్ కి హిట్ దక్కేనా ?

- Advertisement -

తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ హీరోగా ఇటీవల రిలీజ్ అయిన సినిమా విడాముయార్చి. తెలుగులో పట్టుదల టైటిల్ తో ఈ మూవీ డబ్ అయింది. అయితే మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాని అనంతరం తాజాగా ఆయన చేస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీని యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తుండగా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ పరవాలేదనిపించగా ట్రైలర్ డిసప్పాయింట్ చేసింది. అయితే అజిత్ ఫ్యాన్స్ లో మాత్రం ఈ సినిమా మీద మంచి నమ్మకం ఉంది. గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా మూవీగా గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమాని తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ రేపు ఆడియన్స్ ముందుకు రానుంది.

ముఖ్యంగా అజిత్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ అందరినీ కూడా ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని, ఇది ఒక కమర్షియల్ ప్యాకేజీ ఎంటర్టైనర్ అని చెప్తుంది టీం. తప్పకుండా ఈ మూవీతో అజిత్ అతిపెద్ద సెన్సేషన్ అందుకోవటం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.

READ  Coolie That Song will be Hilarious 'కూలీ' : ​ఆ సాంగ్ అదిరిపోనుందట

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories