ధనుష్ నటించిన తాజా ద్విభాషా చిత్రం సార్ (వాతి) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. థియేటర్లలో విమర్శకులను, ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా విశేషమైన ఆదరణ పొందుతూ సంచలనం సృష్టిస్తుంది.
సార్/వాతి సినిమా మార్చి 17 నుండి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ మూడు వెర్షన్లలో కూడా ఈ చిత్రం ఈ ఓటీటీ దిగ్గజ ప్లాట్ ఫామ్ లో టాప్ పొజిషన్ లో ట్రెండింగ్ లో ఉండటం విశేషం. బాక్సాఫీస్ వద్ద ధ నుష్ కెరీర్ బెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంది.
టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్/వాతి శుక్రవారం నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫారంలో విడుదలైంది. భీమ్లా నాయక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త మీనన్ ఈ సోషల్ డ్రామాలో హీరోయిన్ గా నటించారు.
కాగా సముద్రఖని, సాయికుమార్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, నర్రా శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
విద్యారంగంలో దుష్ట పారిశ్రామిక వేత్తల పై పోరాడి నిరుపేద విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణులు అయి టాపర్లుగా నిలవడానికి తోడ్పడే అసిస్టెంట్ లెక్చరర్ పాత్రలో ధనుష్ ఈ చిత్రంలో నటించారు.