Homeసినిమా వార్తలుధనుష్ "సార్" టీజర్ రివ్యూ

ధనుష్ “సార్” టీజర్ రివ్యూ

- Advertisement -

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగులోనూ స్ట్రయిట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక సినిమా ప్రకటించారు. అయితే ఆ సినిమా మొదలవడానికి కాస్త సమయం పట్టేలా ఉండటంతో ఈలోపు ఆయన మరో తెలుగు సినిమాకు శ్రీకారం చుట్టారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ధనుష్ తో తెలుగు, తమిళ భాషల్లో ‘సార్’ సినిమాని నిర్మిస్తున్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ నెల 27న విడుదల చేసారు. అలానే ధనుష్ పుట్టిన రోజును పురస్కరించుకుని సినిమా టీజర్ ను 28న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య తెలిపారు.

‘యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్’ – అంటే ఒక సామాన్య పౌరుడి ప్రతిష్టాత్మకమైన ప్రయాణం అనేది ఈ సినిమా ముఖ్య కథా వస్తువుగా తెలుస్తుంది. మలయాళీ నటి అయిన, ‘భీమ్లా నాయక్’ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన సంయుక్తా మీనన్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు.. సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. తమిళ యువ కెరటం జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

READ  హ్యాట్సాఫ్ డార్లింగ్ అనిపించుకున్న ప్రభాస్

ఇక ఈరోజు హీరో ధనుష్ పుట్టినరోజు సంధర్భంగా తమిళ, తెలుగు వెర్షన్ల టీజర్ లను విడుదల చేశారు.

టీజర్ చూస్తుంటే విద్యా వ్యవస్థలలో జరుగుతున్న అక్రమాలను చూపించడమే ముఖ్య కథగా తెరకెక్కినట్లు అర్థం అవుతుంది. విద్యార్థుల దగ్గర నుండి ఎక్కువ ఫీజులు దండుకుని విద్యను వ్యాపారంగా చూసే ఒక విద్యా సంస్థ.. దానికి ఎదురు నిలిచే ఒక జూనియర్ లెక్చరర్ గా ధనుష్ కనిపిస్తున్నారు. అయితే కేవలం సందేశం మాత్రమే కాదు మాస్ ప్రేక్షకులని అలరించే యాక్షన్ సన్నివేశాలను కూడా సినిమాలో రంగరించి ఉంచారు అని టీజర్ లో ఫైట్ల తాలూకు బిట్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక టీజర్ చివరిలో ‘ విద్య అనేది దేవుడి దగ్గర పెట్టే నైవేద్యం లాంటిది.. దాన్ని పంచండి.. ఫైవ్ స్టార్ హోటల్ లో డిష్ లాగా అమ్మకండి ” అంటూ ధనుష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Rajamouli: రస్సో బ్రదర్స్ అభిమానం చూరగొన్న రాజమౌళి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories