Homeసినిమా వార్తలుSIR: విజయ్ 'వారసుడు' కంటే భారీగా ఉన్న ధనుష్ సార్ సినిమా ఓపెనింగ్స్

SIR: విజయ్ ‘వారసుడు’ కంటే భారీగా ఉన్న ధనుష్ సార్ సినిమా ఓపెనింగ్స్

- Advertisement -

ధనుష్ తాజా చిత్రం సార్ నిన్న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సూపర్బ్ కలెక్షన్లు కూడా రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని తరహాలో ఈ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి. అలాగే తమిళ వెర్షన్ వాతికి కూడా మంచి స్పందన వస్తోంది.

రిలీజ్ డేట్ కి ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ ప్రమోషన్ స్ట్రాటజీ బాగా వర్కవుట్ అయ్యింది. ఫలితంగా సర్ సినిమాకు మంచి ఆదరణ లభించింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో సంచలన ఓపెనింగ్స్ సాధించిన సార్ ఓవరాల్ గా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దళపతి విజయ్ వారసుడు సినిమా తొలిరోజు కలెక్షన్లను దాటడం ద్వారా 2023లో డబ్బింగ్ సినిమాలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది.

నిజానికి వారసుడు సినిమాకి తెలుగు చిత్రసీమలో మాంచి గుర్తింపు ఉన్న దర్శకుడుతో పాటు నిర్మాతగా ఎంతో అనుభవం, పేరు గల దిల్ రాజు ఉన్నారు. అలాగే ఈ సినిమా విడుదల సమయంలో హీరో విజయ్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. పైగా సంక్రాంతి సీజన్ లో విడుదలైన సినిమా.

అయితే ధనుష్ ఈ మధ్య తెలుగులో చేసిన సినిమాలు సరిగా ఆడకపోవడం, ఈ సినిమాకి ముందు దర్శకుడు కూడా బ్యాడ్ స్టేజ్ లో ఉన్నా కూడా సార్ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వారసుడు మొదటి రోజు ఓపెనింగ్ సుమారు 5 కోట్లు ఉండగా, సార్ సినిమా కలెక్షన్స్ 5.25 కోట్లకు పైగా ఉన్నాయి.

ధనుష్ తో పాటు తెలుగులో బింబిసార, భీమ్లా నాయక్, మలయాళంలో కడువా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. సముద్రఖని, తనికెళ్ల భరణి, పి.సాయికుమార్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories