ధనుష్ నటించిన తమిళ – తెలుగు ద్విభాషా చిత్రం ‘వాతి’ అలియాస్ ‘ సార్ ‘. ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా యొక్క తమిళ, తెలుగు ట్రైలర్లను చిత్ర బృందం విడుదల చేయగా ఆసక్తికరమైన సంభాషణలతో ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. కొంతమంది ఇండస్ట్రీ వర్గాల కోసం చిత్ర బృందం స్పెషల్ షో ఏర్పాటు చేయగా ఆ షోకి ఏకగ్రీవంగా మంచి స్పందన వచ్చింది. స్వతహాగా ప్రేమకథలు తీసే దర్శకుడిగా పేరు పొందిన వెంకీ అట్లూరి తొలిసారిగా ఈ చిత్రం ద్వారా ఒక సామాజిక సందేశంతో కూడిన మాస్ కమర్షియల్ సినిమాను తెరకెక్కించారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 14న హైదరాబాద్ లో ‘వాతి/సార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇటీవల ‘వాతి’ అలియాస్ ‘సార్’ తెలుగు ట్రైలర్ లాంచ్ కోసం హైదరాబాద్ వచ్చిన ధనుష్ మరో సారి ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం మహానగరానికి రానున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంయుక్త, ఈ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్నారు.
తమ అభిమాన హీరోకు ‘వాతి’ అలియాస్ ‘సార్’ సరైన ద్విభాషా హిట్ అవుతుందని ధనుష్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ స్పెషల్ షో నుండి వచ్చిన స్పందన గనక నిజమైతే ఖచ్చితంగా 2022 సెప్టెంబర్ లో విడుదలైన తిరుచిత్రబలం వంటి మరో బ్లాక్ బస్టర్ ను ధనుష్ అందుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తమిళనాడు, తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఈ సినిమా కథ సాగుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘వాతి/సార్’ ఓ ముఖ్యమైన సమస్య గురించి చర్చిస్తుంది. ధనుష్ నుంచి ఈ చిత్రం ఖచ్చితంగా మరో పవర్ ఫుల్ మూవీ అవుతుందని అంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.