Homeసినిమా వార్తలుSir: ఇండస్ట్రీ వర్గాల నుంచి పాజిటివ్ రిపోర్టులు తెచ్చుకుంటున్న ధనుష్ సార్ (వాతి)

Sir: ఇండస్ట్రీ వర్గాల నుంచి పాజిటివ్ రిపోర్టులు తెచ్చుకుంటున్న ధనుష్ సార్ (వాతి)

- Advertisement -

ధనుష్ నటించిన తమిళ – తెలుగు ద్విభాషా చిత్రం ‘వాతి’ అలియాస్ ‘ సార్ ‘. ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా యొక్క తమిళ, తెలుగు ట్రైలర్లను చిత్ర బృందం విడుదల చేయగా ఆసక్తికరమైన సంభాషణలతో ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. కొంతమంది ఇండస్ట్రీ వర్గాల కోసం చిత్ర బృందం స్పెషల్ షో ఏర్పాటు చేయగా ఆ షోకి ఏకగ్రీవంగా మంచి స్పందన వచ్చింది. స్వతహాగా ప్రేమకథలు తీసే దర్శకుడిగా పేరు పొందిన వెంకీ అట్లూరి తొలిసారిగా ఈ చిత్రం ద్వారా ఒక సామాజిక సందేశంతో కూడిన మాస్ కమర్షియల్ సినిమాను తెరకెక్కించారు.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 14న హైదరాబాద్ లో ‘వాతి/సార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇటీవల ‘వాతి’ అలియాస్ ‘సార్’ తెలుగు ట్రైలర్ లాంచ్ కోసం హైదరాబాద్ వచ్చిన ధనుష్ మరో సారి ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం మహానగరానికి రానున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంయుక్త, ఈ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్నారు.

READ  Chiranjeevi: బాలకృష్ణ పై మరోసారి రెట్టింపు మార్జిన్ తో గెలిచిన చిరంజీవి

తమ అభిమాన హీరోకు ‘వాతి’ అలియాస్ ‘సార్’ సరైన ద్విభాషా హిట్ అవుతుందని ధనుష్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ స్పెషల్ షో నుండి వచ్చిన స్పందన గనక నిజమైతే ఖచ్చితంగా 2022 సెప్టెంబర్ లో విడుదలైన తిరుచిత్రబలం వంటి మరో బ్లాక్ బస్టర్ ను ధనుష్ అందుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తమిళనాడు, తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఈ సినిమా కథ సాగుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘వాతి/సార్’ ఓ ముఖ్యమైన సమస్య గురించి చర్చిస్తుంది. ధనుష్ నుంచి ఈ చిత్రం ఖచ్చితంగా మరో పవర్ ఫుల్ మూవీ అవుతుందని అంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Follow on Google News Follow on Whatsapp

We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at jobs@tracktollywood.com. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories