తమిళ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాయన్. ఈ మూవీలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, దూశారా విజయన్, అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేయగా సన్ పిక్చర్స్ సంస్థ పై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.
ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన రాయన్ మంచి టాక్ ని సొంతం చేసుకుని ఇప్పటికే గడచిన నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 85 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ మూవీకి త్వరలో సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మూవీని పరిశీలిస్తే ఇందులో ధనుష్ తల్లితండ్రుల జాడ తెలియకపోవడం, ప్రకాష్ రాజ్ తండ్రిని ఎవరిని చంపారనేది చూపించకపోవడంతో క్లైమాక్స్ సన్నివేశాలను బట్టి రాయన్ కి సీక్వెల్ ని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే పక్కాగా ఇది ఎప్పుడు రూపొందనుందనే దాని పై మాత్రం మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ధనుష్ కెరీర్ 50వ మూవీ అయిన రాయన్ మంచి రెస్పాన్స్ అందుకుంటుండడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.