Home సినిమా వార్తలు Raayan Premier Show Talk ధనుష్ ‘రాయన్’ ప్రీమియర్ షోస్ టాక్

Raayan Premier Show Talk ధనుష్ ‘రాయన్’ ప్రీమియర్ షోస్ టాక్

raayan

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాయన్. ఈ మూవీలో సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, కాళిదాస్ జయరాం, దూసారా విజయన్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు. సన్ పిక్చర్స్ సంస్థ పై కళానిధి మారన్ భారీ స్థాయిలో నిర్మించిన రాయన్ నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది.

ఇక ఇప్పటికే ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ ప్రదర్శితంగా కాగా వాటి నుండి మంచి టాక్ ఐతే లభిస్తోంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ తో పాటు క్లైమాక్స్ సీన్స్ రాయన్ కి హైలైట్ అంటున్నారు. అలానే ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ పై ఒకింత మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే మరికొందరు ఆడియన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ బాగుందని అంటున్నారు.

స్టోరీ తో పాటు ఎమోషనల్ సీన్స్ పెద్దగా ఆకట్టుకోలేదని అయితే యాక్షన్ సీన్స్ మాత్రం ఎంతో బాగున్నాయని చెప్తున్నారు. మొత్తంగా చాలావరకు రాయన్ కి ప్రీమియర్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే లభిస్తోంది. ధనుష్ కెరీర్ 50వ సినిమా అయిన రాయన్ మొత్తంగా ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version