Home సినిమా వార్తలు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో సెప్టెంబర్ 29న భారీ స్థాయిలో...

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో సెప్టెంబర్ 29న భారీ స్థాయిలో తెలుగునాట రిలీజ్ అవుతున్న ధనుష్ “నేనే వస్తున్నా” చిత్రం

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయింది.తెలుగులో ఈ చిత్రం “నేనే వస్తున్నా” పేరుతో రిలీజ్ అవుతుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్,గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్29న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల అవుతుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే ‘నానే వరువెన్’ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. తెలుగులో కూడా ఈ చిత్ర పాటలకు,టీజర్ కు మంచి స్పందన లభించింది. ధనుష్ కి కూడా తెలుగులో మంచి మార్కెట్ తో పాటు,అభిమానులు కూడా ఉండటంతో ఈ సినిమా మంచి అంచనాలు నెలకొన్నాయి.

“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై “కలైపులి ఎస్ థాను” నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version