ధనుష్ సార్ (వాతి) చిత్రం తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన వసూళ్లు నమోదు చేస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది మరియు కేవలం ఆ ఓపెనింగ్ కలెక్షన్లతోటే రెండు మూడు రోజుల్లోన్ అనేక ప్రాంతాలలో బ్రేక్‌ఈవెన్ సాధించి ఆశ్చర్య పరిచింది.
కాగా ఈ చిత్రం పలు ప్రాంతాల్లో తమిళ వెర్షన్‌ను అధిగమించి భారీ హిట్‌గా నిలిచింది. సహజమైన నటనకు పేరు తెచ్చుకున్న ధనుష్ ఈ చిత్రంలో కూడా మంచి నటన కనబర్చారు. ఇక జివి ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఆకర్షించడంలో సినిమాకు బాగా సహాయపడింది.
ఇలా అందరి అంచనాలను అధిగమిస్తూ, ఈ చిత్రం తెలుగులో 30 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటింది. దాంతో ఇప్పుడు ధనుష్‌ను కోలీవుడ్ హీరోల ప్రత్యేక క్లబ్‌లో చేరారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్ల గ్రాస్‌ను సాధించిన తమిళ హీరోలు చాలా తక్కువ అనే చెప్పాలి.
రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, రాఘవ లారెన్స్ లాంటి అతికొద్ది మంది మాత్రమే ఈ ఘనతను సాధించగా, ఇప్పుడు ధనుష్ కూడా వారితో జతకట్టారు. 30 కోట్ల గ్రాస్ అనేది చాలా మంచి సంఖ్య అనే చెప్పాలి. ముఖ్యంగా డబ్ సినిమాలకు, మరియు ధనుష్‌కి, ఇది నిజంగా సంచలనం స్థాయి విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
చక్కని మార్కెటింగ్ టెక్నిక్ తో, ధనుష్ యొక్క వాతి/సార్ తెలుగు రాష్ట్రాలలో విడుదలకు ముందే హైప్‌ని సృష్టించింది మరియు బాగా రాణిస్తుందని అంచనా వేయబడింది. చిత్ర కథాంశం పై భారీ నమ్మకంతో నిర్మాతలు పెయిడ్ ప్రీమియర్లను కూడా ఏర్పాటు చేశారు. కాగా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సముద్రఖని, హైపర్ ఆది, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించారు.