Homeబాక్సాఫీస్ వార్తలుBox-Office: బ్లాక్ బస్టర్ సాధించిన దనుష్

Box-Office: బ్లాక్ బస్టర్ సాధించిన దనుష్

- Advertisement -

విలక్షణ నటుడు, మరియు తమిళ యువ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరుచిత్రాంబలం సినిమా నిన్న థియేటర్లలో విడుదలైంది. చక్కని రివ్యులతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి రోజు తమిళ నాట ఊహించినట్టే మంచి నెంబర్లను బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేసింది. అంతే కాక వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి.

ధనుష్‌కి ఇది చాలా అవసరమైన విజయమని చెప్పాలి. నిజానికి ధనుష్ అసురన్, పటాస్, కర్ణన్ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి జోరు మీద ఉండగా, ఇటీవల వరుసగా రెండు పరాజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయన గత రెండు చిత్రాలు కూడా ఓటిటీలో విడుదలయ్యాయి. జగమే తంధిరమ్ మరియు మారన్ సినిమాలు విమర్శకులు మరియు ప్రేక్షకుల చేత తీవ్రంగా విమర్శించబడ్డాయి. ఇక హాలీవుడ్ సినిమా గ్రే మ్యాన్‌లో ధనుష్ నటిస్తున్న విషయాన్ని భారీగా ప్రచారం చేశారు. తీరా చూస్తే అయనది చిన్న అతిధి పాత్రగా ఉండింది. అయితే ఒక పోరాట సన్నివేశంలో ధనుష్ ఆకట్టుకున్నారు.

ఇక వరుస ఓటిటి రిలీజ్ ల తరువాత తిరుచిత్రాంబలం థియేట్రికల్ రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. కొంతమంది సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని ధనుష్ కెరీర్ లోనే మరపురాని సినిమాగా నిలిచిన VIP చిత్రంతో పోలుస్తున్నారు(రఘువరన్ B.Tech). ట్రైలర్ చూసినప్పుడే ఇది VIP సినిమాకు దగ్గరగా ఉందన్న మాటలు వినిపించాయి.

READ  ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో మరో రికార్డు

ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం, ధనుష్ నటించిన ఈ కొత్త సినిమా భారీ బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్రంలో ధనుష్ మరియు నిత్యా మీనన్ ల నటన అందరి హృదయాలను గెలుచుకుంది. వారితో పాటు ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, రాశి ఖన్నా, ప్రకాష్ రాజ్ మరియు తమిళ దిగ్గజ దర్శకుడి మరియు నటుడు భారతీరాజా కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. మిత్రన్ జవహర్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  వినరో భాగ్యము విష్ణు కథ టీజర్ : కొత్త కథ చెప్తాను అంటున్న కిరణ్ అబ్బవరం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories