చిత్రం: ధమాకా
రేటింగ్: 2.5/5
దర్శకుడు: త్రినాధ రావు నక్కిన
తారాగణం: రవితేజ, తనికెళ్ళ భరణి, శ్రీలీల, తులసి, సచిన్ ఖేడ్కర్ తదితరులుడైరెక్టర్ : త్రినాథరావు నక్కిన
నిర్మాతలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
రిలీజ్ డేట్: 23 డిసెంబర్ 2022
రవితేజ నటించిన ధమాకా ఈ శుక్రవారమే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మాస్ మహారాజా’ అభిమానులు చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరోని మాస్ పాత్రలో చూడాలని తహతహలాడుతున్నారు మరియు రవితేజ కూడా ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ పరాజయం తరువాత హిట్ కొట్టాలని తహతహలాడుతున్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కినతో మొదటిసారి జతకట్టిన ఈ చిత్రం వింటేజ్ రవితేజ రోజులను ప్రేక్షకులను తిరిగి ఆకర్షించేంతగా ఉందో లేదో చూద్దాం.
కథ:
ధమాకా అనేది కథానాయకుడు అన్ని అడ్డంకులను వ్యతిరేకంగా పోరాడే కథ. ఆనంద్ చక్రవర్తి అనే పారిశ్రామికవేత్తగా, స్వామి అనే మధ్యతరగతి వ్యక్తిగా రవితేజ రెండు పాత్రల్లో కనిపించారు. ఒక కార్పొరేట్ దిగ్గజం మధ్యతరగతి ప్రజల జీవితాలను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నప్పుడు ఏమి జరుగుతుంది? అతని ప్రయత్నాల వల్ల ఆనంద్ చక్రవర్తి మరియు స్వామి జీవితాలు ఎలా ముడిపడి ఉంటాయి అనేది ఈ చిత్రం యొక్క పూర్తి కథ.
నటీనటులు: స్వామిగా రవితేజ తనకు అలవాటైన పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన తన కెరీర్లో ఇలాంటి పాత్రను చాలా సార్లు చేశారు మరియు ఈ పాత్రను కూడా అంతే ఈజీగా చేశారు. ఇక ఆనంద్ చక్రవర్తిగా కూడా సమానమైన నటనను కనబరిచారు రవితేజ. మొత్తంగా ఈ సినిమాను పూర్తిగా తన భుజం పై మోశారు. ఇక సినిమాలో హీరోయిన్ శ్రీలీల అద్భుతంగా డాన్స్ చేసి రవితేజ ఎనర్జీకి సరిగ్గా సరిపోయారు. ఆమె పాత్రకు నటనకు పెద్దగా స్కోప్ లేనప్పటికీ, ఆమె తను ఉన్న సన్నివేశాలలో రాణించారు. మరియు తను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ అవుతారని అని చెప్పవచ్చు. తనికెళ్ల భరణి, జయరామ్, సచిన్ ఖేడ్కర్, తులసి వంటి తారాగణం ఎప్పటిలాగే తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
విశ్లేషణ: ధమాకా సినిమాలో అతిపెద్ద బలహీనతలలో ఒకటి త్రినాథ రావు నక్కిన నేరేషన్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో కార్పొరేట్ వర్సెస్ కామన్ మ్యాన్ అనే ప్రాథమిక భావన ఉన్నప్పటికీ, దర్శకుడు దానిని ప్రత్యేకంగా చూపించడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు, ఇక్కడే సినిమా విఫలమయింది. రొటీన్ కమర్షియల్ మూవీకి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కథాంశం, సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులు అంచనా వేసేలా, ఆశ్చర్యపోయేలా లేకపోవడం ఈ మాస్ ఎంటర్టైనర్ యొక్క ఇతర ప్రధాన లోపాలుగా చెప్పుకోవచ్చు.
ప్లస్ పాయింట్స్
- రవితేజ నటన
- శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్
- భీమ్స్ సిసిరోలియో సంగీతం
- యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్
- త్రినాథరావు నక్కిన ఏక్జీక్యుషన్
- ఊహించదగిన కథాంశం
- కామెడీ
- కొత్తదనం లేకపోవడం
తీర్పు:
దర్శకుడు త్రినాథరావు నక్కిన కమర్షియల్ పంథాలో సినిమాని సరిగ్గా నడిపి ఉంటే ధమాకా మరింత ఆసక్తికరంగా ఉండేది. అనవసరమైన ట్విస్టులు, బలవంతపు సన్నివేశాలు సినిమాను ఆస్వాదించకుండా చేస్తాయి. కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాలు మీకు నచ్చెట్టు అయితే, ధమాకా ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.