మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా కిందట ఏడాది సర్ ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ధమాకా సినిమాకి విడుదలకు ముందు పాజిటివ్ బజ్ నెలకొల్పగా.. తొలి రోజు మాత్రం ఈ సినిమాకి అనేక మిశ్రమ సమీక్షలు వచ్చాయి మరియు చాలా మంది ఇదొక రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు.
అయితే రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, హీరోయిన్ శ్రీలీల మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఈ సినిమాను అన్ని ఏరియాల్లో భారీ లాభాల బాట పట్టించాయి.
ధమాకా ఇప్పుడు ఓటీటీ అరంగేట్రం కోసం సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ అయిన సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే జనవరి 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల పై త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన లాంగ్ రన్ ను నమోదు చేసింది మరియు వారాంతాల్లో ముఖ్యంగా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సీజన్లలో దాదాపు అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బోర్డులను చూపించింది. మాస్ మహారాజా, త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రమిది.
ఈ చిత్రంలో రావు రమేష్, పవిత్ర లోకేష్, సచిన్ ఖేడ్కర్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ధమాకా విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ స్టేటస్ సాధించి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ స్టేటస్ సాధించింది. 19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా దాదాపు డబుల్ బ్లాక్ బస్టర్ స్టేటస్ సాధించి కమర్షియల్ సినిమా ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసింది.