Home సినిమా వార్తలు Dhamaka Combo Onceagain going to Repeat మరోసారి రిపీట్ కానున్న ‘ధమాకా’ కాంబో

Dhamaka Combo Onceagain going to Repeat మరోసారి రిపీట్ కానున్న ‘ధమాకా’ కాంబో

dhamaka

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమా చేస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక మరోవైపు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా మజాకా. 

ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అందరిలో విశేషమైన క్రేజ్ ఏర్పరచిన మజాకా మూవీ నేడు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే తాజాగా మజాకా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు తినాధరావు నక్కిన మాట్లాడుతూ మజాకా తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

కామెడీతో పాటు యాక్షన్, ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటాయని తెలిపారు. అయితే అసలు విషయం ఏమిటంటే త్వరలో మరొకసారి తాను మాస్ మహారాజా రవితేజతో ఒక మూవీ చేయనున్నట్లు చెప్పారు. గతంలో తామిద్దరి కాంబినేషన్లో వచ్చిన ధమాకా ని మించేలా ఈ క్రేజీ ప్రాజెక్టు మరింత అద్భుతంగా ఉంటుందని అన్నారు. 

అలానే దీనిని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్టు చెప్పారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయన్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఏ విధంగా రూపొందనుందో తెలియాలంటే కొద్దిరోజుల వరకు వెయిట్ చేయాలి

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version