గ్లోబల్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ దేవర పై తారక్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన భారీ మూవీ ఆర్ఆర్ఆర్ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో పక్కాగా ఆయన దీనితో విజయబావుటా ఎగురవేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
దీనికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని పాన్ ఇండియన్ రేంజ్లో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే దేవర నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఆకట్టుకోగా మూడవ సాంగ్ ని రేపు విడుదల చేయనున్నారు. మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి యుఎస్ఏ లోని కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ ని ప్రారంభించారు.
అయితే ఆ టిక్కెట్స్ అలా ఓపెన్ చేయగానే ఇలా చాలా వరకు ఫాస్ట్ గా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక విషయం ఏమిటంటే ఆ టికెట్స్ పోర్టల్స్ ని మనం పరిశీలిస్తే అందులో దేవర పార్ట్ 1 మూవీ యొక్క రన్ టైం 3 గం. 10 ని. ల నిడివి ఉన్నట్లు గమనించవచ్చు. అది చూసి కొందరు అయితే అబ్బో రన్ టైం ఎక్కువే అంటున్నారు. నిజానికి అది అఫీషియలా లేక కాదా అనేది దేవర మూవీ టీమ్ నుండి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.