టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ 1 పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మొదటి నుండి ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.
కొరటాల శివ తీస్తున్న దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. విషయం ఏమిటంటే, నేడు కొద్దిసేపటి క్రితం దేవర పార్ట్ 1 థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.
ముఖ్యంగా ట్రైలర్ లో గ్రాండియర్ విజువల్స్, ఎన్టీఆర్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఎంతో బాగున్నాయి. మొత్తంగా అన్ని విధాలుగా దేవర ట్రైలర్ ని బట్టి చూస్తుంటే సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ మంచి సక్సెస్ అందుకునే అవకాశం కనపడుతోంది. మరి ఈ మూవీ ఎంత మేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.