యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ 1 పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలిసారిగా ఈ మూవీ ద్వారా బాలీవుడ్ కథానాయిక జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగుకు పరిచయం అవుతున్నారు.
ఇక కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల దేవర నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి.
విషయం ఏమిటంటే, ఈ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రేపు రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన మేకర్స్, దానిని రేపు సాయంత్రం 5 గం. 4 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసారు. ఎన్టీఆర్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తుండగా విలన్ పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తనున్నారు. కాగా దేవర పార్ట్ 1 మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.