టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పై రోజు రోజుకు ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎంతో అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ తో పాటు మూడు సాంగ్స్ లో రెండు సాంగ్స్ బాగా రెస్పాన్స్ సొంతం చేసుకోవడం విశేషం.
అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. కొరటాల శివ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న దేవర పార్ట్ 1 మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని సెప్టెంబర్ 10న రిలీజ్ చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్.
ఇక ట్రైలర్ లో భారీ విజువల్స్, యాక్షన్ మాస్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు మరింతగా పెంచడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు. మరి సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ఎంతమేరకు అందరినీ మెప్పిస్తుందో చూడాలి.