టాలీవుడ్ యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలీవుడ్ అండ్ అందాల నటి జాన్వికపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా తెరకెక్కిన తాజా మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర. ఇక ఇటీవల రిలీజ్ అనంతరం మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుంచి క్లోజింగ్ వరకు అందర్నీ ఆకట్టుకుని బాగా కలెక్షన్ రాబట్టింది. ఇందులో రెండు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించారు.
రత్నవేలు ఫోటోగ్రఫీ అందించిన దేవర నిన్న అర్ధరాత్రి నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా వరల్డ్ వైడ్ క్లోజింగ్ పరంగా మొత్తంగా రూ. 420 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్ ని సొంతం చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాల లిస్ట్ లో 6వ స్థానంలో నిలిచింది.
ఇక మొదటి ఐదు స్థానాల్లో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడి, సలార్ మరియు బాహుబలి సినిమాలు నిలిచాయి. వాటి అనంతరం దేవర మూవీ నిలిచింది. ఈ విధంగా రాజమౌళి సినిమా అనంతరం హీరోలు చేసే సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనే కర్స్ ని ఎన్టీఆర్ అధిగమించి భారీ బ్లాక్ బస్టర్ కొట్టారు. మరి దేవర మూవీ ఓటిటిలో ఏ స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.