టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తీసిన లేటెస్ట్ మాస్ యక్ష పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1 ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇంకా పలు ఏరియాల్లో బాగానే కలెక్షన్ రాబడుతుండడం విశేషం.
ఈ మూవీలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపించారు. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే రూ. 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఇక ప్రస్తుతం బాహుబలి 1 మూవీ రికార్డు ని బ్రేక్ చేసే దిశగా దేవర సాగుతోంది. ముఖ్యంగా దేవర తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా రూ. 180 కోట్ల షేర్ ని చేరుకుంది.
కాగా బాహుబలి 1 మూవీ తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా రూ. 184 షేర్ రాబట్టగా నేటితో దేవర మూవీ దానిని అధిగమించనుంది. ఇప్పటివరకు బాహుబలి 1 ని బాహుబలి 2, సలార్, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడి మూవీస్ అధిగమించగా ప్రస్తుతం దేవర కూడా ఈ లిస్ట్ లో చేరేందుకు సిద్దమైంది. మరి మొత్తంగా రాబోయే రోజుల్లో వరల్డ్ వైడ్ గా దేవర ఎంత మేర రాబడుతుందో చూడాలి.