Home సినిమా వార్తలు Devara Success Meet in Guntur గుంటూరులో దేవర గ్రాండ్ సక్సెస్ మీట్ ?

Devara Success Meet in Guntur గుంటూరులో దేవర గ్రాండ్ సక్సెస్ మీట్ ?

jr ntr

పాన్ ఇండియా మాస్ గ్లోబల్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ మాస్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో శ్రీకాంత్, మురళి శర్మ, షైన్ టామ్ చాకో, సైఫ్ ఆలీ ఖాన్ తదితరులు నటించారు. 

రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక ఈ మూవీ ఫస్ట్ డే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టి రెండవ రోజునుండి బాగానే కలెక్షన్ రాబడుతోంది. 

అయితే దేవర మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ సెక్యూరిటీ రీజన్స్ వలన క్యాన్సిల్ అవడంతో ఇటీవల ఫ్యాన్స్ అందరూ డిజప్పాయింట్ అయ్యారు. ఇక దేవర మంచి విజయం వైపు దూసుకెళ్తుండడంతో అతి త్వరలో గ్రాండ్ సక్సెస్ మీట్ ని గుంటూరులో నిర్వహించేందుకు టీమ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి దేవర మేకర్స్ నుని అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుందట. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version