పాన్ ఇండియన్ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీ దేవర పార్ట్ 1 ద్వారా తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చారు టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ ఐకాన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా హీరోయిన్ గా జంప్ కపూర్ నటించారు. మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన దేవరకు అనిరుద్ సంగీతం అందించగా ఇతర ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్, మురళీశర్మ, సైఫ్ ఆలీ ఖాన్, గెటప్ శ్రీను సహా మరికొందరు నటించారు. అయితే మ్యాటర్ ఏమిటంటే ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ రెండవ రోజు రూ. 53 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ నటించిన సలార్ మూవీ రెండవ రోజు రూ. 83 కోట్లని దక్కించుకుంది. అయితే దేవర మూడవ రోజు కలెక్షన్ లో కూడా సలార్ ని దేవర అందుకోవడం కష్టమే అని తెలుస్తోంది.
దేవరకు మూడవ రోజు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడం కూడా అందుకు నిదర్శనం. అయితే దేవరకు మొత్తంగా రూ. 400 కోట్ల కలెక్షన్ లభిస్తే మూవీ హిట్ కొట్టినట్లే. ఈ వీకెండ్ కి రూ. 250 కోట్లని రాబట్టే ఈ మూవీ, ఓవరాల్ గా రూ సలార్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 600 కోట్లని అందుకునే ఛాన్స్ చాలావరకు లేనట్లే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. దానిని బట్టి సలార్ ని దేవర మూవీ అందుకోవడం కష్టమే అని అర్ధమవుతోంది.