టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ ద్వారా తొలిసారిగా బాలీవుడ్ యువ కథానాయిక జాన్వీ కపూర్ టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
ప్రముఖ సంస్థలు యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న దేవర మూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల దేవర పార్ట్ 1 నుండి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ ఎంతో ఆదరణ అందుకుంది. విషయం ఏమిటంటే, తాజాగా దేవర మూవీ యొక్క స్టోరీ పాయింట్ ని ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ రివీల్ చేసారు సంగీత దర్శకుడు అనిరుద్. ఇది సముద్ర నేపథ్యంలో సరికొత్తగా సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ అని అన్నారు.
ఇక రాబోయే సాంగ్స్ తో పాటు బ్యాక్ స్కోర్ కి కూడా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ మూవీని దర్శకుడు కొరటాల అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు అనిరుద్. కాగా దేవర మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.