Home సినిమా వార్తలు Devara Sensation in Telugu States తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ సంచలనం 

Devara Sensation in Telugu States తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ సంచలనం 

devaraa

టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ ఐకాన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తీసిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ఫుల్ గా ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతోంది. 

ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో నటించగా కీలక పాత్రల్లో మురళి శర్మ, శృతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు నటించారు అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించగా రత్నవేలు ఫోటోగ్రఫి అందించారు. 

అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దేవర పార్ట్ 1 మూవీ రూ. 150 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం మొదటి వారంలో ఈ ఫీట్ ని అందుకోవడం విశేషం. 

ఇక గతంలో ఈ ఫీట్ ని తొలిసారిగా బాహుబలి మూవీ అందుకోగా ఆ తరువాత బాహుబలి 2, అలవైకుంఠపురములో, ఆర్ఆర్ ఆర్, కల్కి, సలార్ మూవీస్ దక్కించుకున్నాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రూ. 160 బిజినెస్ చేసిన దేవర పార్ట్ 1 త్వరలోనే అందుకునే అవకాశం గట్టిగా కనపడుతోంది. ప్రస్తుతం దసరా సెలవలు కాబట్టి ఈ మూవీ మరింతగా పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version