టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ ఐకాన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తీసిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ఫుల్ గా ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతోంది.
ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో నటించగా కీలక పాత్రల్లో మురళి శర్మ, శృతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు నటించారు అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించగా రత్నవేలు ఫోటోగ్రఫి అందించారు.
అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దేవర పార్ట్ 1 మూవీ రూ. 150 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం మొదటి వారంలో ఈ ఫీట్ ని అందుకోవడం విశేషం.
ఇక గతంలో ఈ ఫీట్ ని తొలిసారిగా బాహుబలి మూవీ అందుకోగా ఆ తరువాత బాహుబలి 2, అలవైకుంఠపురములో, ఆర్ఆర్ ఆర్, కల్కి, సలార్ మూవీస్ దక్కించుకున్నాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రూ. 160 బిజినెస్ చేసిన దేవర పార్ట్ 1 త్వరలోనే అందుకునే అవకాశం గట్టిగా కనపడుతోంది. ప్రస్తుతం దసరా సెలవలు కాబట్టి ఈ మూవీ మరింతగా పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.