యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ దేవర. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్, పోస్టర్స్ ఇలా అన్ని కూడా అంతకంతకు మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసాయి అని చెప్పాలి.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపించనున్న దేవర మూవీలో ప్రకాష్ రాజ్, అజయ్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు చేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫి అందిస్తున్నారు.
విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 22న హైదరాబాద్ లో జరుగనున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ ట్రైలర్ ని ప్రత్యేకంగా విడుదల చేయనున్నారట. ఆ ట్రైలర్ లో మరిన్ని యాక్షన్ అంశాలు జోడించారని, తప్పకుండా అది చూసాక దేవర పై అమాంతం అంచనాలు పెరగడం ఖాయమని టాక్. మరి రిలీజ్ అనంతరం దేవర ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.