యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే దేవర నుండి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అయితే మూవీ నుండి సెకండ్ సాంగ్ ఈ నెలలోనే రిలీజ్ కానుందని కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం, అసలు పక్కాగా సెకండ్ రిలీజ్ పై మేకర్స్ ఇంకా ఒక క్లారిటీ కి రాలేదని, ఈ విషయమై స్వయంగా వారు స్పందించేవరకు ఆగాల్సిందే అంటున్నారు.
ఇది నిజంగా ఒకింత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ అనే చెప్పాలి. కాగా సినిమాని మరోవైపు వేగవంతంగా పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు కలిగిన దేవర పార్ట్ 1 రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.