పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ తొలిసారిగా తెలుగుకు పరిచయం అవుతూ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి.
ఎన్టీఆర్ ఈ మూవీలో పవర్ఫుల్ పాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకున్న దేవర నుండి ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కంపోజ్ చేసిన ఫియర్ సాంగ్ రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ లో అనిరుద్ అందించిన మ్యూజిక్ తో పాటు లిరిక్స్ కి కూడా బాగా ఆదరణ లభించడం విశేషం.
ఎన్టీఆర్ క్రేజ్ ని మరింతగా పెంచేలా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు కొరటాల ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట. ఇక విషయం ఏమిటంటే, దేవర పార్ట్ 1 నుండి సెకండ్ సాంగ్ ని పక్కాగా ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్. ఇక ఈ సాంగ్ మంచి మెలోడియస్ గా ఉంటుందని, మొత్తంగా సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కూడా అనిరుద్ అదరగొట్టినట్లు చెప్తున్నారు. కాగా దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.