Homeసినిమా వార్తలుDevara Second Song 'దేవర' సెకండ్ సాంగ్ అనౌన్స్ మెంట్ కి ముహూర్తం ఫిక్స్

Devara Second Song ‘దేవర’ సెకండ్ సాంగ్ అనౌన్స్ మెంట్ కి ముహూర్తం ఫిక్స్

- Advertisement -

గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీ ద్వారా జాన్వి కపూర్ టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

ఇంకా ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో పలువురు టాలీవుడ్ తో పాటు ఇతర భాషల నటులు నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే దేవర పార్ట్ 1 నుండి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ నుండి సెకండ్ యొక్క అనౌన్స్ మెంట్ నేడు సాయంత్రం రానుందని లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్ర చేస్తున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. మరి అందరిలో మంచి అంచనాలు కలిగిన దేవర పార్ట్ 1 ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

READ  'డబుల్ ఇస్మార్ట్' : అడ్వాంటేజ్ ని వాడుకుంటుందా ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories