యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దేవర. ఈ పాన్ ఇండియన్ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి అంచనాలు ఏర్పరిచిన దేవర మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా దేవర యొక్క అఫీషియల్ రన్ టైం వెల్లడించి.
కాగా ఈ మూవీ మొత్తంగా 2 గం. 42 ని. ల పాటు సాగనుందని ముఖ్యంగా యాక్షన్ ఎమోషనల్ సీన్స్ తో పాటు ఎన్టీఆర్ పవర్ఫుల్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, గ్రాండియర్ విజువల్స్ వంటివి మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని టాక్. దేవర ఎంతమేర అంచనాలు అందుకుంటుందో ఏమి మరి.