Homeసినిమా వార్తలుDevara Ready for 150 Crore Opening రూ. 150 కోట్ల ఓపెనింగ్ కి సిద్ధమైన...

Devara Ready for 150 Crore Opening రూ. 150 కోట్ల ఓపెనింగ్ కి సిద్ధమైన ‘దేవర’

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

అనిరుద్ ఈ మూవీకి ఇప్పటికే అందించిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలవగా అతి త్వరలో మూడవ సాంగ్ ని కూడా రిలీజ్ చేసేందుకు సిద్దమయింది టీమ్. ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్ర చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అందరిలో మంచి అంచనాలు కలిగిన దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27 న ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈ మూవీ యొక్క ప్రీ బుకింగ్స్ అమెరికాలో ఓపెన్ చేయగా అక్కడ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఇప్పటికే అక్కడ 120కె డాలర్స్ ని దేవర కొల్లగొట్టగా ఓపెనింగ్ పరంగా డే 1 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 70 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశం లేకపోలీదంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇక అటు హిందీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, సహా ఇతర ఇతర ప్రాంతాలు అన్ని కలుపుకుని దేవర పార్ట్ 1 మూవీ డే 1 రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం గట్టిగా కనపడుతోంది.

READ  The Raja Saab Glimpse స్టైలిష్ గా అదిరిపోయిన 'ది రాజా సాబ్' గ్లింప్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories